ఈరోజు తెలంగాణలోని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకకు తెలంగాణ వ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. ఈ వేదిక సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సభ తొలిమెట్టు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చిపెట్టిన తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని టీఆర్ఎస్…
భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రైతుల్ని మోసం చేస్తున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. కానీ ఏడేళ్ళలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభలో ఆయన మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల్ని దగా చేస్తున్నాయి. వివిధ తెగుళ్ళు, వ్యాధులు వచ్చి పంటలు…
వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ. రాబోయే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు మనం ఏం చేయబోయేది తెలియచేద్దాం. దేశంలో ప్రగతి పథంలో నడిపించింది కాంగ్రెస్. రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రైతునే రాజుగా చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ అందించాం. ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. రైతులకు రుణమాఫీ చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో వెళ్లనున్నారు. అక్కడినించి హనుమకొండకు బయల్దేరతారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో…
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుని నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర లాభసాటి పంటల్ని సాగు చేయాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి పెట్టి, పంటల సాగులో ఆదర్శంగా నిలవాలన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి,…
తెలంగాణలో రైతు సంఘర్షణ యాత్రకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని వరంగల్‌లో ఈ సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పెద్దగా చేసిందేమీ లేదని ఆరోపించారు. అప్పుడు వ్యవసాయానికి మూడు విడతల్లో ఏడు గంటల కరెంట్ ఇచ్చారని, విత్తనాలు ఎరువుల కోసం చెప్పులు పెట్టి మరీ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు…
కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణలో తమ ఉనికి చాటేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారని, పథకాల పేర్లతో ప్రజల డబ్బుని దోచేసుకున్నారని, బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రంగంలోకి దిగి, ఆయా విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్స్…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రైతుల సంఘర్షణ సభలో ఆయన రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే… రాహుల్ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే… పార్టీపైన ఆసంతృప్తితోనే రాజ్‌గోపాల్‌రెడ్డి సభకు హజరుకావద్దని నిర్ణయించున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాహుల్ సభ సన్నాహాక సమావేశాల్లో కూడా ఎక్కడా ఆయన కనిపించలేదు. అంతేకాకుండా రాహుల్…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. 5:10కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు.. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు.. 6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో…