వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మళ్లీ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటోంది. అందుకు ఉదయ్ పూర్ లో జరిగే ‘ శింతన్ శిబిర్’ వేదిగా మారబోతున్న సంకేతాలు ఇస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శింతన్ శిబిర్ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కీలక నేతలు రాజస్థాన్…
రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్ లో పార్టీ చేసుకుంటున్న వీడియోను ఈసారి బీజేపీ రిలీజ్ చేసింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుకుతూ పలు విమర్శలకు దారి తీస్తోంది. ఐఎన్సీ అంటే ‘ఐ నీడ్ సెలబ్రేషన్ అండ్ పార్టీ’ అంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ జాతీయ…
వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. చివరకు తాము అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అంతర్గత కలహాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంత ఘోరంగా పార్టీ అపజయాలను…
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో టచ్ మీ నాట్గా కనిపించినట్టు పార్టీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట. వాస్తవానికి కాంగ్రెస్లో రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తర్వాతే ఎవరైనా. కానీ రాహుల్ గాంధీ టూర్ మొదటిరోజు.. ఠాగూర్ కాస్త దూరం అన్నట్టుగా ఉన్నారని టాక్. సాధారణంగా రాహుల్గాంధీ రాష్ట్రానికి వస్తే.. రిసీవ్ చేసుకునే వారిలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ముందు ఉంటారు. కానీ రాహుల్…
అసైన్ట్ భూముల వ్యవహారంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూమిని అడ్డగోలుగా రాయించుకుంటున్నారని, నిషేదిత జాబితాలో చేర్చి.. లాక్కుంటున్నారని ఆరోపించారు. 111 జీవో కూడా ఎత్తివేతలో కుట్ర దాగివుందని, ముందుగానే వేలాది ఎకరాలు తక్కువ ధరకు కొని 111 జీవో ఎత్తేశారని ఆయన ఆరోపించారు. అసైన్డ్ భూమి ఆక్రమణలో అధికార పార్టీ నేతలే వున్నారని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వాళ్లకు…
ఇందిరా, పీవీలు ప్రధానిగా ఉన్నప్పుడు పేదలకు భూములు ఇచ్చారని జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాగీర్ దార్ల వద్ద 45 ఎకరాల కంటే ఎక్కువగా ఉండొద్దని చట్టం ఉందని, గతంలో.. 48 లక్షల ఎకరాల భూమిని పంపిణి చేశారన్నారు. అంతేకాకుండా ఆ భూమిని.. కేవలం వ్యవసాయం చేసుకోవాలి, అమ్ముకోడానికి వీలులేదని క్లాజ్ పెట్టారన్నారు. అంత సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. వైఎస్సార్ కూడా తన తండ్రి…
ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ను ప్రకటించారు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ని ప్రతీ ఒక్కరికి తెలియాలని రాహుల్ గాంధీ అన్నారన్నారు. రైతు డిక్లరేషన్లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందని, రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపికి భయంపట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాహుల్…
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని స్కామ్ గ్రెస్ పార్టీ గా ప్రజలు చూస్తున్నారని, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. గన్ పార్క్ ముందు నుండి వెళ్లిన రాహుల్ గాంధీ అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదని, అమరవీరుల స్మృతి వనం నిర్మాణం…
వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు రెండింతలు అయ్యాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ధరలతో పోల్చి చూపిస్తూ రాహూల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. 2014లో 14.2 కిలోల…
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్ వేదికగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదని, మూడోసారి కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు కేటీఆర్. అభివృద్ధి కొనసాగిస్తాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అమ్ముకుంటోంది. బీజేపీ అసలు స్వరూపం ఇదే. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ. గ్యాస్ ధరల్లో…