Cheruku Sudhakar: తెలంగాణ పొలిటికల్ లో ముందుస్తు మాటలు నిజమవుతాయా అన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే.. పార్టీ జంపింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో షేక్ హ్యాండ్ తీసుకోవడమే కాకుండా.. తెలంగాణ ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసారు.
read also:Vice President Election: విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
చెరుకు సుధాకర్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన 1961 ఆగస్టు 31న గుండ్రంపల్లిలో జన్మించారు. ఎంబీబీఎస్ చదివారు. 1997లో తెలంగాణ సాధన కోసం యాక్టివ్‌గా పని చేశారు. కాగా.. మలి దశ ఉద్యమంలో టీఆర్‌ఎస్ అధ్యక్షడు కేసీఆర్ నుంచి పిలుపు అందడంతో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాత.. టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఇంటి పార్టీ స్థాపితం చేసి ప్రజల ముందుకు వచ్చారు. అయితే గత ఏడాది జరిగిన ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
Reavnth Reddy: వెంకన్న మా వాడే.. రాజ్ గోపాల్ ద్రోహి..