Congress Protests Live Updates: పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతిభవన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాదయాత్రగా వెళ్లనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా అనుమతించలేమని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ తప్ప మిగతా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద బారికేడ్లతో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.