కేంద్రంలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్… ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించింది.. కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు చింతా మోహన్.. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చింతామోహన్ మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనని గుర్తుచేశారు.. నేడు దళితులు దేవాలయాలకు, విద్యాలయాలకు వెళ్తున్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న ఆయన.. జవహర్ లాల్ నెహ్రూ వేసిన పునాదులతో ఏపీలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. ఇక, రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం వల్ల నేడు ప్రజలందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు కొడుతుంటే ఏడుపొస్తోందన్న ఆయన… 2024లో ఏపీలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది.. కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.
Read Also: TTD: టీటీడీపై సుబ్బిరామిరెడ్డి ప్రశంసలు.. అన్యాయానికి అవకాశం లేకుండా సేవ చేస్తున్నారు..