కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెట్టించిన ఉత్సాహంతో భారత్ జోడోయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు వేలాదిమంది పాల్గొంటున్నారు. అయితే ఆయన పాల్గొనే పాదయాత్రలో వింత సమస్య అటు కాంగ్రెస్ కార్యకర్తలను, పోలీసులను వేధిస్తోంది. అదే దొంగల బెడద… దొంగలు జనం ఎక్కువగా వున్న చోట తమ ప్రతాపం చూపిస్తారు..అక్కడ మంత్రి వున్నా.. ఆఖరికి సీఎం వున్నా అంతే. తాజాగా రాహుల్ గాంధీ పాదయాత్రలో అదే జరిగింది. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జేబు దొంగలు రెచ్చిపోయారు.
At the end of 5 days the #BharatJodoYatra has completed exactly 100 kms. The padayatra has rattled, unnerved and disturbed the BJP, whereas the Congress party has already been refreshed 100-fold. Every step we walk renews our resolve! pic.twitter.com/eRzYBxsvoS
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 12, 2022
అగ్రనేత రాహుల్ గాంధీతో ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుండగా.. వారి జేబులను కత్తిరిస్తున్నారు దొంగలు. పాదయాత్ర కేరళలో రెండో రోజు కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.రాహుల్ గాంధీతో ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. సందట్లో సడేమియాలా జనం జేబులను కత్తిరిస్తున్నారు దొంగలు.కేరళలోని కరమన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనాలు జరిగాయని తెలుస్తోంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలగురు దొంగలను గుర్తించారు పోలీసులు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే ప్రాంతంలో ఇలా దొంగతనాలు జరగడం కామన్. అయితే, పాదయాత్రలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. తమ ఫోన్లు పోయాయని కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు.
Read Also: Deputy CM Narayana Swamy: అది రైతుల యాత్ర కాదు.. కోటీశ్వరుల యాత్ర
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాదయాత్రలో భాగంగా కేరళలో 19 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ కేరళలో 457 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైంది. కాశ్మీర్ లో ముగుస్తుంది.150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితల ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. రాహుల్ యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు, నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో మూడుచోట్ల బహిరంగసభలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ ,శంషాబాద్, జోగిపేట లలో సభలు వుంటాయి. ఎన్నికల మేనిఫెస్టో ,రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై సభలో ప్రస్తావన వుంటుందని భావిస్తున్నారు.
Read Also:God Father: ‘జై దేవ్’గా సత్యదేవ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల