కాంగ్రెస్ పార్టీకి గత వైభవం తేవడానికి యువరాజు రాహుల్ గాంధీ గట్టిప్రయత్నమే చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజపరచడానికి ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర నాలుగవ రోజుకి చేరుకుంది. 4వ రోజు కన్యాకుమారి జిల్లా మూలగం మూడు నుంచి ప్రారంభమైంది రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర..కేరళలోకి ఈరోజు రాత్రికి ప్రవేశించనుంది భారత్ జూడో యాత్ర…త్రివేండ్రం దగ్గర్లోని చివర కోణం ద్వారా ప్రవేశించనుంది రాహుల్ పాదయాత్ర. రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు ఆయన వెంట నడుస్తున్నారు.