Meghalaya Governor Satyapal malik comments on Rahul Gandhi: కేంద్రప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు చేస్తుంటారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. పలు అంశాలు, సమస్యలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో రైతు ఉద్యమం, లఖీంపూర్ ఖేరీ ఘటనపై కేంద్రాన్నికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం మానేస్తే తనను ఉపరాష్ట్రపతి చేస్తారని ప్రజలు సూచించారని.. ఈ సూచనలు నాకు కూడా వినిపించాయని శనివారం అన్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేనని.. నాకు అనిపించింది మాట్లాడుతానని అన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ కర్ అర్హుడైన అభ్యర్థి అని అన్నారు సత్యపాల్ మాలిక్.
Read Also: Weather Update: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రను ప్రశంసించారు. రాహుల్ గాంధీ తన పార్టీ కోసం పనిచేస్తున్నారని.. ఇది మంచిదని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించిప్పుడు.. నాకు తెలియదు, దీన్ని ప్రజలే చెప్పాలని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సరైన పని చేస్తున్నాడని భావిస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులు చేసిన విధంగానే బీజేపీ నేతలపై కూడా దాడులు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీలో దాడి చేయాల్సిన వారు చాలా మంది ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్ పథ్ పేరు మార్పుపై కూడా స్పందించారు. రాజ్ పథ్ పేరు మార్పు అవసరం లేదని.. రాజ్ పథ్ మంచి పేరుందని.. ‘కర్తవ్య మార్గ్’ మంత్రలా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేరేలా కనిపించడం లేదని.. రైతుల డిమాండ్లపై త్వరలోనే ఆందోళన చేస్తామని సత్యపాల్ మాలిక్ అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎదుగుదలను ప్రశ్నిస్తూ.. ఆయన సంపద క్రమంగా పెరుగుతోందని.. అయితే రైతుల ఆదాయం తగ్గుముఖం పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.