కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ కదం తొక్కుతూ పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో పదోరోజు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతుంది. నిన్న శుక్రవారం విశ్రాంతి అనంతరం నేడు భారత్ జోడో యాత్ర ఉదయం 6.30 గంటలకు సంగారెడ్డి జిల్లా చౌటకూరు నుంచి మొదలైంది.
పోతురాజు అవతారమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా భారత్ జోడో పాదయాత్రలో పోతురాజులు కలిసారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోణాలు, పోతురాజుల గురించి రాహుల్ గాంధీకి వివరించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీంతో.. రాహుల్ గాంధీ కొరడా అందుకొని పోతురాజుల విన్యాసాలు చేసి కొరడాతో రెండు సార్లు కొట్టుకున్నారు.
సంగారెడ్డి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. చేర్యాల దగ్గర చిన్నారులతో కలిసి రాహుల్ గాంధీ కరాటే చేశారు. ఈనేపథ్యంలో.. రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు. ఆయనకు 89 సంవత్సరాల వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి చేతిలో చేయివేసి రామదాసు సతీ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు.