Anurag Thakur Counter To Rahul Gandhi: భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్ దేశాలు చేతులు కలిపాయని.. అవి ఎప్పుడైనా మన దేశంతో దాడి చేయొచ్చని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఇంకా 1962ల్లోనే జీవిస్తున్నారని కౌంటర్ వేశారు. భారత సైన్యాన్ని పదే పదే అవమానించేలా వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్‌కి హితవు పలికారు. ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు పదే పదే చేస్తూ.. భారత సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందా? లేక భారత సైన్యంపై రాహుల్ గాంధీకి నమ్మకం లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Salman Khan: 2023పైనే సల్మాన్ ఖాన్ ఆశలు!
ఉగ్రమూకల కట్టడికి భారత సైన్యం విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిందని.. డోక్లాంలోనూ చొరబాట్లను మన సైన్యం దీటుగా తిప్పికొట్టిందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో.. సైనికులకు కనీసం మంచు బూట్లు, సూట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, యుద్ధ విమానాలు సమకూర్చలేకపోయారన్న మాట వాస్తవమేనంటూ ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనా శతృవులను ఎదుర్కునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉన్నారు. సరిహద్దుల్లో రక్షణ బలగాలు పటిష్టంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. గతంలో చైనా అధికారులను కలిసినప్పుడు రాహుల్ గాంధీ ఏం తిన్నారు, ఏం తాగారు, ఏం మాట్లాడారనే విషయాలు ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని అనురాగ్ చెప్పారు.
Men Health: మగవారిలో సెక్స్ డ్రైవ్‌ను పెంచే 8 నేచురల్ ఫుడ్స్
కాగా.. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాజీ సైనిక ఉద్యోగులతో ముచ్చటించిన ఓ వీడియోను ఇటీవల విడుదల చేశారు. గల్వాన్, డోక్లాంలలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల వెనుక డ్రాగన్ వ్యూహం ఉందని.. పాక్‌తో కలిసి భారత్‌పై దాడి చేసేందుకు ఇది సన్నాహన్నారు. పాక్, చైనాల మధ్య ఇప్పటికే ఆర్థిక సంబంధాలు ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే.. ఆ రెండు దేశాలు కలిసి దాడి చేస్తాయన్నాయన్నారు. అది దేశానికి తీరని నష్టం కలిగిస్తుందని రాహుల్ తెలిపారు. ఇలా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్ పై విధంగా మండిపడ్డారు.