Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టింది. హర్యానాలోని బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. ఇవాళ ఢిల్లీలోని ఎర్రకోట వరకు యాత్ర సాగనుంది. ఢిల్లీలోకి ప్రవేశించగానే రాహుల్ ప్రసంగించారు. కొంతమంది ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. కానీ దేశంలోని సామాన్యులు ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రలో చేరారరన్నారు. మీ ద్వేషపూరిత బజార్‌లో ప్రేమ దుకాణం తెరవడానికే తాము ఇక్కడ ఉన్నానని ఆర్‌ఎస్ఎస్-బీజేపీ వ్యక్తులతో చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మీదుగా ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. ఇధిలా ఉంటే ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు నేడు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మక్కల్ నీది మయ్యం(ఎంకేఎం) పార్టీ అధినేత కమల్ హాసన్‌ను భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ గతంలో కోరారు. డిసెంబర్ 24న దేశ రాజధానిలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని కమల్ హాసన్ ఎంకేఎం ఆఫీస్ బేరర్ సమావేశంలో అన్నారు. దేశ రాజధానిలో జరిగే యాత్రలో కనీసం 40,000 నుంచి 50,000 మంది యాత్రికులు పాల్గొంటారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి తెలిపారు.
Covid Alert: కరోనా కట్టడిపై కేంద్రం దృష్టి.. నేటి నుంచి విదేశీ ప్రయాణికులకు పరీక్షలు
సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర ఐదు నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనుంది. మొత్తంగా 3570 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. కాశ్మీర్‌లో జరిగే జోడో యాత్రతో ఈ పాదయాత్ర ముగియనుంది. 2023 జనవరి26న కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది. ఇప్పటికే స్వరాభాస్కర్ వంటి బాలీవుడ్ నటులు రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నారు.ఢిల్లీలో ముగిసిన తర్వాత పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోకి చేరుతుంది భారత్ జోడో యాత్ర.
#WATCH | Congress's Bharat Jodo Yatra enters national capital Delhi.
(Source: AICC) pic.twitter.com/KH2eyPjTxD
— ANI (@ANI) December 24, 2022