Kamal Haasan Likely To Join Rahul Gandhi’s Bhrat jodo Yatra In Delhi Tomorrow: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో సాగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ప్రస్తుతం హర్యానాకు చేరింది.
Read Also: China: చైనాలో కోవిడ్ కల్లోలం.. ఒకే రోజు 3.7 కోట్ల కేసులు
ఇధిలా ఉంటే ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు రేపు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మక్కల్ నీది మయ్యం(ఎంకేఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ను భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ గతంలో కోరారు. డిసెంబర్ 24న దేశ రాజధానిలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని కమల్ హాసన్ ఎంకేఎం ఆఫీస్ బేరర్ సమావేశంలో అన్నారు. దేశ రాజధానిలో జరిగే యాత్రలో కనీసం 40,000 నుంచి 50,000 మంది యాత్రికులు పాల్గొంటారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి తెలిపారు.
సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర ఐదు నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనుంది. మొత్తంగా 3570 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. కాశ్మీర్ లో జరిగే జోడో యాత్రతో ఈ పాదయాత్ర ముగియనుంది. 2023 జనవరి26న కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది. ఇప్పటికే స్వరాభాస్కర్ వంటి బాలీవుడ్ నటులు రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నారు. హర్యానాలో ముగిసిన తర్వాత ఢిల్లీ మీదుగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లోకి చేరుతుంది భారత్ జోడో యాత్ర.