Bharat Jodo Yatra: అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు యాత్రను నిలిపివేసిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: ఢిల్లీలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం తన భారత్ జోడో యాత్రను అపోలో ఆసుపత్రి సమీపంలో నిలిపివేశారు. అంబులెన్స్‌ని వెళ్లనివ్వడానికి కాసేపు ఆగాడు. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని తోటి యాత్రికులను కూడా కోరాడు. ఈ సంఘటన దేశ రాజధానిలోని అపోలో ఆసుపత్రి సమీపంలో జరిగింది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఉదయం హర్యానాలోని బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. బదర్‌పూర్ బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఢిల్లీలోని 23 కిలోమీటర్ల మేర సాగి ఎర్రకోట దగ్గర ముగుస్తుంది. ఈ యాత్ర ఆశ్రమ్ చౌక్, నిజాముద్దీన్, ఇండియా గేట్, ఐటీవో, రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్ మీదుగా వెళుతుంది. ఎర్రకోటకు వెళ్లే ముందు ఆశ్రమ చౌక్ వద్ద రెండు గంటల విరామం తీసుకోనున్నారు. భారత్ జోడో యాత్ర ఇప్పటికే దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించింది.
Encounter: బీజాపూర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మీదుగా ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర ఐదు నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనుంది. మొత్తంగా 3570 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. కాశ్మీర్‌లో జరిగే జోడో యాత్రతో ఈ పాదయాత్ర ముగియనుంది. 2023 జనవరి26న కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!