Hath Se Hath Jodo Yatra: భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి జరిగే హత్ సే హాత్ జోడో కార్యక్రమానికి రాష్ట్రాల పరిశీలకులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ యాత్రలో భారత్ జోడో యాత్రలోని విశేషాలను వివరించడంతో పాటు తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు నాయకులు వివరించనున్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తలకు సభ్యత్వ బీమాను అందజేయనున్నట్లు తెలుస్తోంది.
Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ ధర ప్రకటించిన భారత్ బయోటెక్
ఈ యాత్రను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రానికి ఒక పరిశీలకుడిని నియమించారు. తెలంగాణ పరిశీలకుడిగా గిరీష్ చోడాoకర్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ పరశీలకుడిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గోవా పరిశీలకుడిగా మాజీ ఏపీ పీసీసీ శైలజానాథ్, పుదుచ్చేరి పరిశీలకుడిగా మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మహారాష్ట్ర పరిశీలకుడిగా మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు నియామకమయ్యారు.