China and Pakistan are planning to attack India together, Says Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ఇప్పుడు పాకిస్తాన్, చైనా ఇద్దరు శత్రువులు ఉన్నారని ఆయన అన్నారు. భారత్ పై దాడికి ప్లాన్ చేస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మాజీ సైనికులతో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే..ఇరు వర్గాలు నష్టపోతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత దేశం ప్రమాదంలో ఉందని ఆయన పేర్కొన్నారు. నాకు సైన్యంపై గౌరవం మాత్రమే కాదు, ప్రేమ, ఆప్యాయత ఉన్నాయని.. మీరే దేశాన్ని రక్షించాలని, మీరు లేకుండా దేశం లేదని రాహుల్ గాంధీ తెలిపారు.
మన శత్రువులు అయిన చైనా, పాకిస్తాన్లను విడిగా ఉంచడమే మా విధానం అని ఆయన తెలిపారు. ఇంతకుముందు రెండు వైపులా యుద్ధం రాని అనుకున్నాం.. కానీ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్, చైనా, ఉగ్రవాదంతో రెండున్నర వైపుల నుంచి యుద్ధం జరుగుతోందని అంటున్నారని వెల్లడించారు. చైనా, పాకిస్తాన్ సైనికంగానే కాకుండా ఆర్థికంగా కలిసి ఉన్నాయని అన్నారు. దీనికి గ్వాదర్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉదాహరణలని తెలిపారు. 2014 తర్వాత మన ఆర్థిక వ్యవస్థ మందగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కలవరం, తగాదాలు, గందరగోళం, ద్వేషాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Read Also: Putin: పాశ్చాత్య దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
చైనా, పాకిస్తాన్ దేశాలు భారత్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు చూస్తున్నాయని అంచానా వేశారు. అందుకే ప్రభుత్వం ఏం చెప్పడం లేదని ఆరోపించారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అరుణాచల్, లడఖ్ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందున్నట్లు తెలిపారు. గల్వాన్, డోక్లామ్ ఘర్షణలు చూస్తుంటే చైనా ఏదో ప్లాన్ తో ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టాటర్ యాంగ్ట్సే ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా, భారత్ ఆర్మీల మధ్య ఘర్షణ నెలకొంది. దీనిపై రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. మన భద్రతాదళాలు చైనా ఆక్రమణను తిప్పికొట్టాయని ప్రకటించారు. అయితే దీనిపై చర్చించాలంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో చైనా సైనికులు భారత సైనికులను కొట్టారంటూ డిసెంబర్ 9న వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.