నలుగురు ఎమ్మెల్యేలు నీతిమంతులైతే ప్రగతి భవన్ లో ఎందుకు దాచిపెట్టినట్టని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. నిన్న కేసీఆర్ సభపెట్టి పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణ తప్ప అందులో ఏమి లేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని తెలిపారు.
పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమే అని మండిపడ్డారు. పాదయాత్రలు చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందని అన్నారు.
రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆరోరోజు కొనసాగుతోంది. ఇవాల్టితో రాహుల్ గాంధీ మొదలు పెట్టిన భారత్ జోడో యాత్రకు 54వ రోజు. ఇవాళ షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సర్దార్ పటేల్, ఇందిరాగాంధీలకు నివాళులర్పించారు. గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాద ఘటన బాధితులకు 2 నిముషాలు మౌనం పాటించారు.
Poonam Kaur: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసింది. ఈ మేరకు కాసేపు రాహుల్ గాంధీతో కలిసి పూనం కౌర్ పాదయాత్రలో పాల్గొంది. అయితే రాహుల్ గాంధీని పూనమ్ కౌర్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. రాహుల్ చేయిని పూనమ్ కౌర్ పట్టుకున్న ఫోటోను బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ పోస్ట్ చేయగా అది…