BJP is spreading hatred between Hindus and Muslims, Says Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ‘భారత్ జోడో యాత్ర’ను చేపట్టింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి యాత్రను మొదలుపెట్టారు. తాజాగా ఈ యాత్ర పలు రాష్ట్రాల గుండా ఢిల్లీకి చేరుకుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ‘యునైట్ ఇండియా మార్చ్’ జరిగింది. శనివారం సాయంత్ర ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు రాహుల్ గాంధీ. అధికార భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.
మతపరమైన విభేదాలను ఆయుధంగా చేసుకుని బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు హిందూ-ముస్లిం ద్వేషాన్ని 24 గంటలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీలు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరిలో పాటు స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)పార్టీ అధినేత కమల్ హాసన్, రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. నేను 2,800 కిలోమీటర్లు నడిచాను కానీ ఎలాంటి ద్వేషాన్ని చూడలేదు. నేను టీవీని ఆన్ చేసినప్పుడు మాత్రం నాకు హింస కనిపిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇది నరేంద్రమోదీ ప్రభుత్వం కాదని.. అంబానీ-అదానీల ప్రభుత్వం అని విమర్శించారు. డిగ్రీ పట్టా పొందిన యువకులు పకోడీలు అమ్ముకుంటున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
Read Also: Maternity Leave To Students: విద్యార్థినులకు మాతృత్వ సెలవులు.. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్ణయం
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ యాత్రలో పాల్గొనడం రాజకీయంగా నష్టపరుస్తుందని పలువురు తనకు చెప్పారని.. అయితే నా మనస్సు మాత్రం దేశానికి ఇది చాలా అవసరం అని చెప్పిందన్నారు. దేశాన్ని ఏకం చేయడంలో సహాయపడండి.. విచ్చిన్నం చేయవద్దని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.
కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకుంది. యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర సాగింది. కాశ్మీర్ లో జోడో యాత్ర ముగియనుంది.