కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో నెలకొన్న సంక్షోభంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు అయ్యింది.. అయితే, రాజీనామా చేసినప్పట్టి నుంచి మౌనంగా ఉన్న కెప్టెన్.. ఇవాళ ఒక్కసారిగా.. రాష్ట్ర నేతల నుంచి అధిష్టానం వరకు ఎవ్వరినీ వదిలేదు లేదన్నట్టుగా ఫైర్ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలైనా రాహుల్, ప్రియాంక వాద్రాలకు రాజకీయంగా అనుభవం లేదని కామెంట్ చేసిన ఆయన.. వారిని సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం చర్చగా మారింది.
ఇక, పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పొసగకే ఈ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే కాగా.. సిద్ధూపై గాటు వ్యాఖ్యలు చేశారు కెప్టెన్.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూను సీఎంను కానివ్వబోమని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని ఖచ్చితంగా ఓడిస్తామని ప్రకటించారు.. సిద్ధూ ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయనతో దేశ భద్రతకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సిద్ధూపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతామన్నారు. సిద్ధూతో పంజాబ్ రాష్ట్రానికే కాదు, దేశానికే ప్రమాదమని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక, ఎమ్మెల్యేలను గోవాకో, ఇంకే ప్రాంతానికో విమానంలో తీసుకెళ్లే పని తనకు చేతకాదని, జమ్మిక్కులు చేయడం తెలియదని అమరీందర్ సింగ్ తెలిపారు. తన గురించి గాంధీ కుటుంబానికి బాగా తెలసని చెప్పారు. సిద్ధూ.. దేశ భద్రతకు ముప్పు అని, అందుకే ఆయన్ను పంజాబ్ ముఖ్యమంత్రిని కానివ్వకుండా అడ్డుకుంటామని మరోసారి స్పష్టం చేశారు కెప్టెన్.