పంజాబ్‌లో కీలక పరిణామం.. పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఇటీవలే సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. సిద్ధూను ఎప్పటికీ సీఎంను కానివ్వను అంటూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.. మరోవైపు.. పంజాబ్ కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా తారాస్థాయికి చేరింది.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే, తాను పార్టీని వీడడం లేదని.. మరికొన్ని రోజులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే సీఎం అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.. ఈ సందర్భంగా సిద్ధూపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. సీఎం పదవి సిద్ధూకు ఇస్తే ఊరుకోనని హెచ్చరించారు కూడా.. దాంతో అధిష్టానం పంజాబ్ సీఎంగా చరణ్‌సింగ్‌ను నియమించింది.. ఇక, రాజకీయ సంక్షోభం ముగిసిందనుకున్న సమయంలో.. ఉన్నట్టుండి సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సిద్ధూ రాజీనామా వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సిద్ధూ 72 రోజులు పంజాబ్ పీసీసీ చీఫ్ హోదాలో పనిచేశారు.. మరోవైపు.. బీజేపీలో చేరేందుకు అమరీందర్‌సింగ్ రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు అమరీందర్.. మొత్తంగా మరోసారి పంజాబ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.
Also Read
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!