పంజాబ్‌లో చరణ్‌జిత్ సన్ని మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 15 మందితో కూడిన మంత్రివర్గం ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఇందులో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురికి మంత్రులుగా పదవులు లభించాయి. 15 మంది మంత్రుల చేత గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా బ్రహ్మ్ మొహింద్రా, మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, త్రిప్త్ రాజిందర్‌సింగ్ బజ్వా, సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్జీత్‌సింగ్, అరుణ చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ అషు, విజయ్ ఇందర్ సింగ్లా, రణ్‌దీప్ సింగ్ నభా, రాజ్‌కుమార్ వెర్క, సంగత్ సింగ్ గల్జియాన్, పర్గత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, గుర్‌కీరట్ సింగ్ కొట్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఇందులో రాణా గుర్జిత్ సంగ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. ఇసుక మాఫిమా కుంబకోణంలో ఆరోపణలు ఎదుర్కొనడంతో ఆయన్ను 2018లో మంత్రివర్గం నుంచి పక్కకు తప్పించారు. అయితే, పార్టీలోని పలువురు రాణాకు మంత్రి పదవి ఇవ్వొద్దని పేర్కొన్నా, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ ఒత్తడిమేరకు చరణ్‌జిత్ సింగ్ చన్ని ప్రభుత్వంలో తిగిరి మంత్రిగా తీసుకున్నారు. రాణాకు మంత్రి పదవి ఇవ్వడంతో మళ్లీ పార్టీలో విభేదాలు తలెత్తే అవకాశం ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.