దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఆంక్షలు సడలించడంతో నిబంధనలను పక్కన పెట్టి బయట తిరుగుతుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. పైగా ఇప్పుడు పిల్లల్లో కరోనా కేసులు బయటపడుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తిరిగి ఆంక్షలు విధించేందుకు సిద్దమవుతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 వ తేదీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్‌లోకి అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా రెండు…
ఇప్పటికే ఢిల్లీలో విజయవంతమైన ఉచిత విద్యుత్ హీమీని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నది ఆప్. ఇందులో భాగంగా ఆప్ ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఈ హామీని ఇచ్చింది. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే తప్పకుండా ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ఆప్ పేర్కొన్నది. ఆప్ హమీపై పంజాబ్ యువతి వెరైటీగా స్పందించింది. తనకు ఉచిత విద్యుత్ అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్…
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి… అయితే, కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి కోలుకుంటూ.. క్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి స్కూళ్లను తెరిచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.. అందులో భాగంగా.. ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది పంజాబ్ ప్రభుత్వం.. ఆగస్టు 2వ తేదీ నుంచి పాఠశాలల తెరవాలంటూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ సర్కార్..…
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు…
నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్టైలే వేరు.. ఈ టీమిండియా మాజీ క్రికెటర్‌కు సిక్సర్ల సిద్ధూగా పేరు ఉండగా.. ఇప్పుడు తన పనిలోనూ.. ఆ సిక్సర్లను గుర్తు చేస్తున్నారు.. ఏకంగా స్టేజ్‌పైనే సిక్సర్ బాదినట్టు పోజులు ఇచ్చారు.. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.. స్టేట్‌పైన సిద్ధూ సిక్స్ కొట్టడం ఏంటనే విషయానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆ తర్వాత 62 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శన కూడా…
ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.. కాంగ్రెస్ అధిష్టానం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని సిద్ధూకి పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమనిగినట్టు కనిపించడంలేదు.. ఇక, తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇవాళ సిద్ధూ సమావేశం అయ్యారు.. అమృత్‌సర్‌లోని…
పంజాబ్ పిసిసి అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే… నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమించింది ఏఐసిసి అధిష్ఠానం. వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా సంగత్ సింగ్ గిలిజియన్, సుఖవీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్ నగ్రా లను నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు నియామకాలను ఆమోదిస్తూ ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఓ కొలిక్కి వచ్చాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిద్దూ అనతి కాలంలోనే పార్టీలో మంచి పట్టు సాధించారు. అయితే, కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, సిద్దూ వర్గంగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. ఈ తగాదాలు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. సిద్దూకి కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ముఖ్యమంత్రిగా అమరిందర్ సింగ్ కొనసాగనున్నారు. దీంతో పంజాబ్‌లో గొడవకు…
సామాన్యుడి పార్టీ పంజాబ్‌పై కన్నేసింది. పంజాబ్ రాష్ట్రానికి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తన ముద్రను వేసుకోవాలని చూస్తోన్నది ఆప్. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. గతంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన ఆప్, ఇప్పుడు మరో వంద యూనిట్లు పెంచింది. 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌తో పాటుగా ఉత్తరాఖండ్‌పై కూడా ఆప్ కన్నేసింది. కేజ్రీవాల్…