పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో నెలకొన్ని సంక్షోభానికి తెరదింపేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం.. కొత్త సీఎంను.. డిప్యూటీ సీఎంనులను సైతం నియమించింది.. ఇక, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే కొత్త సీఎం చరణ్‌సింగ్ చన్నీకి భారీ షాకే తగిలింది.. అయితే, అది సొంత పార్టీ నుంచో.. అధిష్టానం నుంచో కాదు.. జాతీయ మహిళా కమిషన్ నుంచి.. విషయం ఏంటంటే..? చరణ్ సింగ్‌పై ‘మీటూ’ అరోపణలు ఉన్నాయి.. 2018లో ఆయనపై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన కొట్టిపారేశారు.. ఇప్పుడు వాటిని ప్రతిపక్ష పార్టీలు తిరగతోడుతున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) సైతం లేవనెత్తింది. అంతటితో ఆగకుండా చన్నీ రాజీనామా చేయాలంటూ ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేయడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. ఆయన ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది..