కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు.. ఏకంగా ఏడాదికి పైగా దేశ రాజధాని శివారులో తమ ఉద్యమాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి.. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, ఈ పోరాటం వెనుక రైతు సంఘాలు, వాటికి ప్రాతినిథ్యం వహించిన నేతల కృషి మరువలేనిది… రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. ‘సంయుక్త…
రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. మరోసారి విశ్వ వేదికపై భారతీయ అందం మెరిసింది. పంజాబ్ అమ్మాయి హర్నాజ్ కౌర్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్‌లో అట్టహాసంగా సాగిన మిస్ యూనివర్స్ పోటీలలో 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి టైటిల్ విజేతగా నిలిచింది. భారతీయ యువతి చివరిసారిగా 2000లో మిస్ యూనివర్శ్ గెలుచుకుంది. 1994లో తొలిసారి సుస్మితాసేన్ విశ్వసుందరిగా ఎంపిక కాగా, 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. 21…
తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ సాయికిరణ్ రెడ్డి పంజాబ్‌లో విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారంరోజులుగా సాయికిరణ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విధుల కోసం వెళ్లిన సాయికిరణ్ అసలు పంజాబ్ చేరుకున్నాడో లేదో అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అతడికి ఏం జరిగిందోనని భయాందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు…
రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. అయితే, దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు.. ఇలా ఒక్కటేంటి.. అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలున్నాయి.. ఇక, అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం వింటుంటాం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇది ప్రారంభం అయిపోయిందని తెలుస్తోంది.. దీనికి కారణం ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. తాజాగా…
పంజాబ్‌లో పాలన సవ్యంగా నాలుగు రోజులు సాగితే రెండు రోజులపాటు రగడ జరుతుంది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన తరువాత ముఖ్యమంత్రులను నిద్రపోకుండా చేస్తున్నారు. పక్కలో బల్లెంమాదిరిగా మారిపోయాడు. ఇటీవలే ఇసుక విషయంలో ముఖ్యమంత్రి ఇసుక విషయంలో తప్పుడు లెక్కలు చెప్పబోతుంటే, వారించి ప్రభుత్వం ఇప్పటికీ ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రజల ముందు సర్కార్‌ను తక్కువ చేసి చూపడంతో పరువు పోయింది. ఇప్పుడు మరో సమస్యను ప్రభుత్వం ముందుకు…
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ కోల్పోయింది. ఉత్తరాదిలో పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గత రెండు పర్యాయాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుతం కేవలం రెండు హిందీ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి రాజస్థాన్, చత్తీస్‌గఢ్. ఇంటిపోరుతో మధ్యప్రదేశ్‌ను పోగొట్టుకుంది. ఉన్న రెండింటిలో చత్తీస్‌గఢ్ చిన్న రాష్ట్రం. మిగిలింది రాజస్థాన్. లోకసభ సీట్ల పరంగా చూసినపుడు ఇది మధ్యస్థ రాష్ట్రం. అంటే 20-39 ఎంపీ సీట్లున్న రాష్ట్రాలను మీడియం సైజ్ రాష్ట్రాలు…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూపై ఢిల్లీ సీఎం ప్రశంసలు కురిపించారు. గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పాటు, ఇప్పటి సీఎం చరణ్ జిత్ సింగ్ చేతిలో కూడా సిద్దూ అణిచివేతకు గురవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిద్దూ ధైర్యాన్ని తాను ప్రశంసించానని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ.5 కు అమ్ముతున్నట్టు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చెప్పగా, అది అబద్దమని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు…
గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం వ్యవసాయ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా మూడు నూతన చట్టాలను ఆమోదించింది. దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు వీటిని వ్యతిరేకించాయి. మొదట పంజాబ్, హర్యానా రైతులు ఆందోళనలకు దిగారు. కానీ, కేంద్రంలోని మోడీ సర్కార్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్షాల మాటనూ బేఖాతరు చేసింది. దాంతో ఉద్యమ వేదిక ఢిల్లీకి మారింది. 2020, నవంబర్ 26న రైతు ఆందోళన కొత్త మలుపు తిరిగింది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి వేలాదిగా…
కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సంవత్సరం కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. Read: భారీ వర్షాల ఎఫెక్ట్: తిరుచానూరులో వరద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు… ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని, ఇది కేంద్రంపై రైతులు సాధించిన విజయమని అన్నారు.…
ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణమైన విషయమే.. ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఢిల్లీలో రెండోసారి పీఠం ఎక్కిన ఆ పార్టీ.. ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.. అయితే, ఆప్ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ.. ఇవాళ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. గతంలో బటిండా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు.…