పంజాబ్‌లో పాలన సవ్యంగా నాలుగు రోజులు సాగితే రెండు రోజులపాటు రగడ జరుతుంది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన తరువాత ముఖ్యమంత్రులను నిద్రపోకుండా చేస్తున్నారు. పక్కలో బల్లెంమాదిరిగా మారిపోయాడు. ఇటీవలే ఇసుక విషయంలో ముఖ్యమంత్రి ఇసుక విషయంలో తప్పుడు లెక్కలు చెప్పబోతుంటే, వారించి ప్రభుత్వం ఇప్పటికీ ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రజల ముందు సర్కార్‌ను తక్కువ చేసి చూపడంతో పరువు పోయింది. ఇప్పుడు మరో సమస్యను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని, కమిటీని ఏర్పాటు చేసింది.
Read: తమిళనాడులో భారీ వర్షాలు… రెడ్ అలర్ట్…చెన్నై ఎయిర్‌పోర్ట్ మూసివేత…
కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిపోర్ట్ ప్రభుత్వం చేతికి వచ్చినా దానిని ఓపెన్ చేయకుండా దాచి ఉంచింది. దీనిపై సిద్ధూ తాజాగా విమర్శలు చేశారు. వెంటనే డ్రగ్స్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలని, రిపోర్ట్‌లో ఏమున్నదో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రిపోర్ట్‌ను బహిర్గతం చేయకుంటే తాను నిరాహారదీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడింది. సొంత పార్టీ నేత ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో నేతలు వాపోతున్నారు. పైగా సిద్ధూను ఇప్పుడు ఏమనలేని పరిస్థితి వచ్చింది. సిద్ధూ ప్రజల కోసం పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రులు ఆయన్ను అణిచివేయాలని చూస్తున్నారని పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయింది పంజాబ్ ప్రభుత్వం.