బీజేపీపై సంచలన ఆరోపణలు.. కేబినెట్‌లో చోటు, డబ్బు ఇస్తామని ప్రలోభాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. అయితే, దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు.. ఇలా ఒక్కటేంటి.. అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలున్నాయి.. ఇక, అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం వింటుంటాం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇది ప్రారంభం అయిపోయిందని తెలుస్తోంది.. దీనికి కారణం ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. తాజాగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేయడమే.
Read Also: వైసీపీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం.. ఆ ఘనత జగన్‌దే..!
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపిన ఎంపీ భగవంత్ మాన్… బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశచూపారని, అంతే కాదు కేంద్ర కేబినెట్‌లో చోటు కూడా కల్పిస్తామని చెప్పారంటూ ఆరోపణలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన భగవంత్ మాన్.. బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత.. నాతో మాట్లాడారు… పార్టీలో చేరేందుకు మీకు ఏం కావాలి? డబ్బులేమైనా కావాలా? మా పార్టీలోకి వస్తే కేంద్ర కేబినెట్‌లో కావల్సిన పోస్టు ఇస్తామని ఆయన తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.. ఇక, సమయం వచ్చినప్పుడు సదరు బీజేపీ నేత పేరును కూడా బయటపెడతానన్న ఆయన.. పంజాబ్‌లోని ఆప్ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ నేతలు గాలం వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డ ఆయన.. తాను ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. కాగా, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్ని అంతర్గ విభేదాలతో సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్‌సింగ్.. కొత్త పార్టీ పెట్టి.. బీజేపీతో పొత్తుకు సిద్ధం అయ్యారు. మరోవైపు.. పంజాబ్‌పై ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు వాగ్ధానాలు చేశారు పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇక, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!