రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిన కొన్ని రోజులకే సంయుక్త సమాజ్ మోర్చా ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. SKM కింద 32 ప్రధాన రైతు సంఘాలు పోరాటం చేశాయి. ఇందులో 22 సంఘాలు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించాయి.
షెడ్యూల్ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తు కష్టం కాబట్టి… ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, రైతు సంఘాల నేతలు మాత్రం తాము ఆప్‌తో పోటీకి సిద్దంగా లేమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని అంటున్నారు.