Dog Beats Cancer: క్యాన్సర్ తో బాధపడుతున్న పోలీస్ జాగిలం, ఇప్పుడు దాన్నుంచి విముక్తి పొందింది. కాన్సర్ ని జయించి తిరిగి విధుల్లోకి చేరింది. లాబ్రాడార్ జాతికి చెందిన పోలీస్ జాగిలం పంజాబ్ పోలీస్ శాఖలో విధ్వంసక తనిఖీల్లో సహాపడుతుందని పోలీసులు తెలిపారు. సిమ్మీ అనే పేరున్న ఈ జాగిలం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
Read Also: Ravi Shastri : టీమిండియాకు ధోనీని కెప్టెన్ చేయమని చెప్పింది నేనే..
ఫరీద్‌కోట్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్జిత్ సింగ్ మాట్లాడుతూ.. సిమ్మీ చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతుందని, ప్రస్తుతం దాని ఆరోగ్యం మెరుగుపడిందని, ఇప్పుడు తిరిగి విధుల్లో చేరిందని చెప్పారు. ఒక సందర్భంలో విదేశీయుడి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకునేందుకు ఈ కుక్క పోలీసులకు సహాయపడిందని ఆయన చెప్పారు. పంజాబ్ పోలీసులు పోలీస్ డాగ్ సిమ్మి విధుల్లో చేరే వీడియోను పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
సిమ్మిని అభినందిస్తూ పలువురు నెటిజెన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘‘స్వాగతం సిమ్మీ’’అంటూ ఓ నెజిజన్ కామెంట్ చేయగా.. మరొకరు ‘‘ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది’’ అంటూ కామెంట్స్ చేశారు. కాన్సర్ జయించిన లాబ్రడార్ ని ‘హీరో’ అని పొగిడారు. ‘‘ వావ్ సిమ్మీ.. లాబ్రడార్ ఓ ధైర్యవంతమైన కుక్క అని, క్యాన్సర్ ను జయించి పంజాబ్ పోలీస్ కనైన్ స్వ్కాడ్ లో తిరిగి చేర్చుకున్నారా..? దాని పాజిటివ్ ధృక్ఫధం ఆకట్టుకుందని, దానికి రివార్డుగా మరిన్ని ట్రీట్స్ ఇవ్వాలని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు.
#WATCH | Faridkot: A Labrador dog named Simmy, who is part of the Punjab Police Canine squad, beats cancer and joins back duty pic.twitter.com/hT4qEqFqH4
— ANI (@ANI) May 19, 2023