ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్( 8 బంతుల్లో 21 పరుగులు), హర్‌ప్రీత్ బ్రార్ ( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా రెండు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలా ఒక్క వికెట్ సాధించారు.
Also Read : Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు
అయితే.. 180 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ విజయం సాధించింది. ఉత్కంఠపోరులో 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి రింకూ సింగ్ కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. 180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ నితీష్ రాణా 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్ (42), రింకూ సింగ్(21) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read : Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. మళ్లీ చక్రం తిప్పిన చిన్నమ్మ..