మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగింపు సమయానికి ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణ కోసం ఓటర్లు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మూడు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా యూపీఏ-ఎన్డీఏ పాలన తేడాను గమనించాలని పంజాబ్ ఓటర్లను కోరారు.
ఇది కూడా చదవండి: Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..?
మన్మోహన్ సింగ్ రెండు పర్యాయాలు భారత ప్రధానిగా సేవలందించారు. మొన్నటిదాకా రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ఆరోగ్యరీత్యా ఆయన ఈసారి రాజ్యసభకు వెళ్లలేదు. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. గురువారం చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓటర్లకు మాజీ ప్రధాని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Rishabh Pant: థాంక్యూ గాడ్.. అంటూ రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్..
ఈ సందర్భంగా ఎన్డీఏ పాలనకు-యూపీఏ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించారు. గత యూపీఏ హయాంలో జరిగిన పాలన గురించి గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్ని క్లుప్తంగా తెలియజేశారు. 1991లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, అలాగే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కూడా ఆయన పని చేసిన అనుభవం ఉంది.
బీజేపీ ప్రభుత్వ హయాంలో సగటు జీడీపీ వృద్ధి ఆరు శాతానికి పడిపోయిందని తెలిపారు. నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చెప్పారు. బీజేపీ నిర్ణయాలు వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి.. మోడీ మోసం చేశారని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో రైతు రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు. అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను తప్పుపట్టారు. ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ రద్దు చేస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గమనించి ఓటు వేయాలని ఓటర్లకు మాజీ ప్రధాని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Rajisha Vijayan: పెళ్ళికి రెడీ అయిన మరో హీరోయిన్.. అబ్బాయి ఎవరంటే?