పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోత్ సిద్ధూ సతీమణి కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని.. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి ‘రూ. 500 కోట్ల సూట్‌కేస్’ అవసరమని.. అంత డబ్బు తమ దగ్గర లేదన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్ గులాబ్ చంద్ కటారియాతో సమావేశం తర్వాత నవజ్యోత్ కౌర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: వందేమాతరం కేవలం పాట కాదు.. భారత దిక్సూచి
తన భర్త కీయాశీల రాజకీయాల్లోకి రావాలంటే 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. అప్పుడు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై పరిశీలిస్తామని వెల్లడించారు. ‘‘మేము ఎల్లప్పుడూ పంజాబ్, పంజాబీయత్ కోసం మాట్లాడుతాం. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి మా దగ్గర రూ. 500 కోట్లు లేవు.’’అని అన్నారు. ఎవరూ తనను వ్యక్తిగతంగా డబ్బు కోసం సంప్రదించలేదని, కానీ ‘రూ. 500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు’ అని స్పష్టం చేశారు. ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే పంజాబ్‌ను అభివృద్ధి చేస్తారన్నారు.
ఇది కూడా చదవండి: Indigo Crisis: డంప్ యార్డ్‌ల్లా ఎయిర్‌పోర్టులు.. ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా లగేజీ బ్యాగులు
నవజ్యోత్ సిద్ధూ సతీమణి కౌర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయకంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఎదురుడాడికి దిగింది. ఎవరు రూ.500 కోట్లు అడిగారని.. వారి పేర్లు బయటపట్టాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కన కాంగ్రెస్ తీరు ఏంటో అర్థమవుతుందని ఆప్ వ్యాఖ్యనించింది.