ఈ రోజు జరిగే బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు హాజరవుతారని, వారి సమక్షంలో బీజేపీలో చేరుతానని సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు చెప్పారు.
తెలంగాణ రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ సారి సెప్టెంబర్ 17వ తారీఖున అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.
అమిత్‌షా తెలంగాణలో పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రేపు భద్రాచలం కార్యక్రమం క్యాన్సిల్ అయింది. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు షా రానున్నారు.
కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం అంటున్నారు.. ధరణి తీసేస్తే రైతుల అధికారం పోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ధరణి ఉంటే మీ భూమిని సీఎం కూడా మార్చలేడు.. తీసేస్తే అధికారుల దగ్గర పోతుంది.. ధరణి పోతే పెద్ద పాము మింగినట్టు అయితదని కేసీఆర్ చెప్పారు.
KTR Visit to Warangal: మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభకు ఆయన హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా అమిత్ షా సమావేశం కానున్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా అదే చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది.