తెలంగాణ రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ సారి సెప్టెంబర్ 17వ తారీఖున అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో.. కమలం పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్దు ఎత్తున సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. తుక్కుగూడ సభకు సోనియాగాంధీ వస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలపగా.. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలకు గత ఏడాదిలాగే అమిత్ షా హాజరు అవుతారని సమాచారం.
Read Also: Bigg Boss Telugu 7: ఛీఛీ.. కంటెంట్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. బిగ్ బాస్..?
అయితే, ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని సిద్ధమయింది. దాదాపు పది లక్షల మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే వెల్లడించింది. తుక్కుగూడను అందుకు వేదికగా హస్తం నేతలు ఎంచుకున్నారు. ఆ తేదీ లేదా అంతకు ముందు రోజు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్ల్యూసీ ) సమావేశాలు జరుగబోతున్నాయి. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను తెలంగాణ పీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
Read Also: Sreemukhi: ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న శ్రీముఖి..
ఇక. కాంగ్రెస్ తుక్కుగూడ సభకు పోటీగా కమలం పార్టీ సైతం హైదరాబాద్ లో సభ ఏర్పాటుకు ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కమలం పార్టీ నేతలు తెలిపారు. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Read Also: CM KCR: సీఎం కేసీఆర్‌తో మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా సమావేశం
దీంతో ఒకేరోజు.. అటు తెలంగాణ విమోచన దినోత్సవం.. ఇటు హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఇరు పార్టీలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.