శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో యువశక్తి సభ ప్రారంభం అయింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువశక్తి సభకు యువత తరలివస్తోంది. పవన్ కళ్యాణ్ సభ కోసం 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో ఏర్పాట్లు చేసారు. పవన్ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణంలోనే ఉండనున్నారు. మరోవైపు సభా వేదికపై యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ తీర్మానాలు చేస్తారని జనసేన నేతలు అంటున్నారు.
వచ్చే ఎన్నిల్లో ఒంటరిగా వెళ్లడానికి నేను సిద్ధం అని ప్రకటించారు పవన్ కల్యాణ్.. మీరు క్షేత్రస్థాయిలో బలం కలిగిస్తే నేను ఒంటరిగానే వెళ్తాను అని పార్టీ శ్రేణులు ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఆయన.. కుదిరితే పొత్తులు లేదంటే ఒంటరిగానే పోటీ అన్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని స్పష్టం చేశారు.
నేను కులం కోసం వచ్చిన వాడిని కాదు.. నా తెలుగు నేల, నా దేశం బాగుండాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్ కల్యాణ్.. జైలుకెళ్లిన ఖైదీ నంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా? ఖైదీ నంబర్ 6093కి సెల్యూట్ కొట్టడం నా వల్లకాదు.. పోలీసునైతే చచ్చిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇంకోసారి నన్ను ప్యాకేజీ స్టార్ అంటే.. నా జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతా.. మా వీర మహిళ చెప్పు తీసుకుని కొడతా నని హెచ్చరించారు పవన్ కల్యాణ్.. నాపై మాట్లాడేవాళ్లను నేను మర్చిపోను.. నా వాళ్లు మర్చిపోరు అని వార్నింగ్ ఇచ్చారు.
నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే ఎదుర్కొన్న వాడిని, గుర్తుపెట్టుకోండి.. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టండని చెప్పా.. నన్ను భయపెట్టాలని చూసినా, నాపై దాడులు చేసినా నేను భయపడలేదన్నారు పవన్ కల్యాణ్
అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్.. ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. ఆయన మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు.
నా కోసం కాకుండా, సాటి మనిషి కోసం జీవించే జీవితం గొప్పది అన్నారు పవన్ కల్యాణ్.. నా సమాజం, నా దేశం కోసం ముందుకు రావాలి నిర్ణయించుకున్నా.. మహా అయితే ప్రాణం పోతోంది.. కానీ, ఒక సత్యాన్ని బలంగా మాట్లాడినవాడినవుతా నని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు..
రాజకీయాల్లోకి రాకపోతే.. నన్ను తిట్టేవాళ్లు కూడా నాతో ఫొటోలు దిగేవాళ్లే అన్నారు పవన్ కల్యాణ్.. ఇక, నా చివరి శ్వాస ఉన్నంత వరకు రాజకీయాలను వదలను.. గూండాగాళ్లను ఎలా తన్నాలో నాకు తెలుసని ప్రకటించారు..
గెలుస్తానో ఓడిపోతానో కాదు.. పోరాటమే తెలుసున్నారు పవన్ కల్యాణ్.. ఎదవల్ని ఎదుర్కోవడం, గూండాలను తన్నడం తెలుసు.. ఉత్తరాంధ్ర యాత్ర చేసినప్పుడు నా వద్ద, పార్టీ వద్ద డబ్బులు లేవన్నారు.. నాకు సుఖాలమీద మమకారం లేదు.. ఉద్దానంలోసరైన త్రాగునీరు లేఖ రోగులైన వ్యక్తులను చూసాను... ఉపాధి లేఖ నలిగిపోతున్న యువతను చూశాన్నారు పవన్..
మనల్నిఎవడ్రా ఆపేది అంటూ రణస్థలంలో జరుగుతోన్న యువశక్తి సభలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కల్యాణ్.. మనదేశం సంపద యువత.. యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా అన్నారు.. ఉత్తరాంధ్ర పొరాటాల గడ్డ.. ఉపాధిలేనప్పుడు.. వలసపై నాయకులు నిలదీయకపొతే ఎలా..? అని ప్రశ్నించారు.
నేను సాధించనదానికి నాకు సంతోషం లేదన్నారు పవన్ కల్యాణ్.. నేను ఈరోజు ప్రతి సన్నాసి, యదవ చేత మాట అనిపించుకొకుండా ఉండగలను.. కేవలం మనకొసం జీవించే జీవితంకాకుండా సాటిమనిసి గూర్చి బ్రతకడం ఇష్టం అన్నారు పవన్ కల్యాణ్.. రాజకీయ నేతలు ప్రజల్ని బానిషలుగా చూస్తున్నారు.. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా వద్ద ఇంత సమూహం లేదన్నారు.. మహా అయితే నాప్రాణం పోవచ్చు.. కానీ, పిరికి తనం నాకు చిరాకు అన్నారు పవన్ కల్యాణ్
యువశక్తి సభలో మాట్లాడిన హైపెర్ ఆది.. మంత్రులపై విరుచుకుపడ్డారు.. మంత్రులకు శాఖలు ఎందుకు, పవన్ ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండి అని సెటైర్లు వేశారు.. 150 మంది ఎమ్మెల్యేలు ఒక్కడి ముందు బయపడుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రతి ఒక్కడికీ ఒక గోల్ ఉంది.. నాకు ఓ గోల్ ఉందని.. పవన్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట వినాలని ఉందన్నారు.. వారాహి యాత్రను ఆపితే పవన్ పాదయాత్ర చేస్తారు.. అప్పుడు మీకు శవయాత్రే అని హెచ్చరించారు.
రణస్థలం వేదికగా జనసేన పార్టీ యువశక్తి సభ జరుగుతోంది.. ఇక, సభా వేదికపైకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వేదికపై థింసా కళాకారులతో కలిపి కాలు కదిపారు.. వారితోపాటు కలిసి లయబద్ధంగా స్టెప్పులు వేశారు పవన్ కల్యాణ్
యువశక్తి బహిరంగ సభలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. ఈ ఘటనలో విశాఖకు చెందిన యువకుడి కంటి కింద గాయం తగిలింది.. అయితే, పోలీసుల తీరుపై జనసైనికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జనసేన నిర్వహిస్తోన్న యువశక్తి సభ ప్రాంగణం బయట స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.. ఈ ఘటనలో బారికేడ్లు దగ్గర నిలబడ్డ ఉర్లామ్ కు చెందిన గణేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి.. చెయ్యికి దెబ్బ తగలడంతో ఆస్పత్రికి తరలించాయి జనసేన శ్రేణులు.
శ్రీకాకుళం జిల్లా రణస్దలం వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోన్న యువశక్తి సభ ప్రాంగణానికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పటికే జనసేన నేతలు వేదక దగ్గరకు చేరుకున్నారు.. ఇక, రణస్థలం యువశక్తి సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయలు ప్రతిభించేలా కళారూపాలు ప్రదర్శిస్తున్నారు.. తప్పెట గుళ్లతో కళాకారులు సంది చేశారు..
రణస్థలం యువశక్తి సభకు బయలుదేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
యువత అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
శ్రీకాకుళం , రణస్థలం యువశక్తి సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఉత్తరాంధ్ర సంస్కృతి , సాంప్రదాయలు ప్రతిబించేలా కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. తప్పెట గుళ్లతో సందడిచేశారు కళాకారులు. ఉత్తరాంధ్ర వైభవం తెలిపేలా ద్వారాలు ఏర్పాటు చేశారు. యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానందుడి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న యువశక్తి సభ వేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశాం అని జనసేన నేతలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన నేత కొణిదెల నాగబాబు. సిఎం జగన్ ఉన్నత విద్యావంతుడు కాదు , ఎవరు చెప్పినా వినడు. బాబాయ్ హత్య తప్పుగా కనిపించడం లేదు. ఉద్యోగులు , ఉపాధ్యాయులు మీద నిఘా పెడుతున్నారు. పోలీసులు , సిఐడి లాంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇసుక , మద్యం అక్షరమాలు , రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయింది. వారాహి యాత్రను అడ్డుకొనేందుకే జివో నెంబర్ 1. ప్రజాస్వామ్యం నిలువనా పాతరవేయటానికే పాత చట్టం తెరమీదకు తెచ్చింది. పౌర హక్కులు హరించివేయటానికి ప్రయత్నిస్తున్నారు.
మరికొద్ది సేపట్లో భోగాపురం బీచ్ రిసార్ట్స్ నుంచి రణస్థలం బహిరంగ సభా వేదికకు బయలు దేరనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్....రణస్థలం యువశక్తి సభకు వెళ్లే మార్గంలో స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ సన్నాహాలు చేశారు. గజమాలతో బీచ్ రిసార్ట్స్ కు చేరుకున్నారు జనసైనికులు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.