KTR Visit to Warangal: మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.840 కోట్లతో చేపట్టనున్న వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పార్కు నుంచి మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ ద్వారా ఖిలావరంగల్ చేరుకుంటారు. ముందుగా వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో ఏర్పాటు చేసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం సమీపంలోని అజాంజాహిమిల్స్ మైదానంలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
India’s largest Textile park at Warangal; Kakatiya Mega Textile Park is shaping up well
KITEX factories are getting ready to be launched in a few months and Ganesha Ecotech has already commenced operations
Tomorrow I will be breaking ground for a ₹900 Cr investment by… pic.twitter.com/B79UpOF0gR
— KTR (@KTRBRS) June 16, 2023
అక్కడినుంచి దేశాయిపేటలో రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, వరంగల్‌లో రూ.135 కోట్లతో నిర్మించిన పదహారు స్మార్ట్ రోడ్లను కూడా వరంగల్‌చౌరస్తాలో కేటీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే రూ.75 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్ స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జీ ఫ్లక్స్ ఐదు అంతస్తుల బస్ స్టేషన్ నిర్మాణానికి కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కుడా) శంకుస్థాపన చేయనుంది. అనంతరం ఆజంజాహిమిల్స్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 50 వేల మందితో నిర్వహించనున్న ఈ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
Govinda Namalu: మనసులోని కోర్కెలు తీరాలంటే గోవింద నామాలు వినండి