అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికారయాత్రలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయని దుయ్యబట్టారు. మాట తప్పను అంటూ జగన్ ఈ రాష్ట్రానికి మెడలు విరిచేసాడు.. దళితులకు అండగా ఉంటాను అని దళితులను హత్య చేస్తున్నావని సీఎం జగన్ పై మండిపడ్డారు. అక్క, చెల్లెమ్మలు అంటూ ఆస్తిలో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (7 ఏప్రిల్ 2024) బీహార్‌లో పర్యటించనున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దుతుగా ప్రచారం చేయబోతున్నారు. అలాగే, నవాడాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని…
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో 'సిద్ధం' సభ జనసంద్రమైంది. సభ జన సునామీని తలపిస్తుంది. కాసేపట్లో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, నేతలు 'సిద్ధం' సభలో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలని తెలిపారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారని అనిల్ దుయ్యబట్టారు. ఎంతమంది…
టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.