భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ( శుక్రవారం ) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
టీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ సెక్టార్ లో పురోగతితో యువత ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని మంత్రి తెలిపారు.
MODI Tour: వరంగల్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
PM MODI: ప్రధాని మోడీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజిలో ప్రధాని మోడీ సభ విజయ సంకల్ప సభకి ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా సిబ్బంది వేదికని అణువణువు తనిఖీ చేస్తున్నారు. 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Etala Rajender: ప్రజల కష్టాలను తీర్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ప్రధాని మోడీ వరంగల్ సభపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోడీ వస్తున్నారని అన్నారు.
Etala Rajender: బీజేపీ నేతలు కలిసికట్టుగా ఉన్నాం.. కలిసే పనిచేస్తాం.. విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ప్రధాని మోదీ వరంగల్ సభపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి.
ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. మోడీని చంపుతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్ ను ట్రేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.