ఎన్డీయే ప్రభుత్వం DNAలోనే తెలంగాణ రాష్ట్రంపై విషం నింపుకునీ ఉన్నది అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము.. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. తెలంగాణ పుట్టుకను పదే పదే ఎందుకు అవమానిస్తున్నారు?.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత కాలం అన్నారు.. విషం చిమ్మారు.. మోడీ సర్కార్ విభజన హామీలను గాలికి వదిలేశారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Read Also: Nayanathara: భార్య-పిలల్ల పిక్స్ షేర్ చేసిన విగ్నేష్.. నయనతార కొడుకులు ఎంత క్యూట్ ఉన్నారో చూశారా?
తెలంగాణలో దశాబ్ది వేడుకలు జరుపుకున్నాం.. కానీ వేడుకలు జరుగలేదని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పాడు అని మంత్రి కేటీఆర్ మండిపడ్డాడు. మోడీ పాలమూరు జిల్లాను ఎంచుకున్నారు.. ఆ జిల్లాలో కాలు పెట్టే నైతిక హక్కు ఆయన లేదు అని మంత్రి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఏమి చేసింది?.. గోదావరి, కృష్ణ జలాల్లో వాట తేల్చాలని కోరారు.. ఇప్పటి వరకు అతి గతి లేదు.. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నో సార్లు అడిగాం.. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also: Bangalore Bandh: కావేరీ జలాల వివాదం.. బెంగళూరు బంద్, 1000 మంది అరెస్ట్
నీటి వాటాపై ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు గడ్డపై కాలు పెట్టేటప్పుడు స్పష్టత ఇవ్వాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కర్ణాటక, ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇచ్చింది.. భారతీయ జనతా పార్టీ కాదు మీది.. దగుల్బాజీ పార్టీ మీది.. బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అయిన.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఆ పార్టీది.. కృష్ణా జలాలపై మా వాట ఎందుకు తేల్చారు మోడీ? చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కృష్ణా జలాల వాటా కోసం న్యాయ పోరాటం చేశామని ఆయన పేర్కొన్నారు. 575 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి.. మోడీ ఇప్పుడైన పాప పరిహారం చేసుకుండి.. పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వండి.. వచ్చే ఎన్నికల్లో ఈ సారి కూడా 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు పోతాయని కేటీఆర్ తెలిపారు.
Read Also: Colours Swathi: విడాకులయ్యాయో లేదో చెప్పాలన్న రిపోర్టర్.. షాకిచ్చిన కలర్స్ స్వాతి
మనసుతో ఆలోచించి ఉంటే గవర్నర్ తమిళిసై నిర్ణయం ఇలా ఉండేది కాదు అని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.. మరి ఈ ఇద్దరు అన్ ఫిట్ అన్నారు.. మరి మీరు అన్ ఫిట్ ఆ.. లేక మోడీ అన్ ఫిట్.. ఆ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీతో సంబంధం ఉంటే.. తప్పు ఏంటీ?.. గవర్నర్ తీరును ఖండిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తే.. కొంత మంది వస్తారు.. కొంత మంది పోతారు.. అది పెద్ద విషయం కాదు.. గవర్నర్ విషయంలో మాకు ఉన్న అన్ని ఆప్షన్ లు చూస్తామని కేటీఆర్ చెప్పారు.