ఎన్నికల కమిషనర్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడంతో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో ఒక స్థానం ఖాళీ కానుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదని వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ 67వ వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్‌కు ఆయన చేరుకోనున్నారు.
సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘మూర్ఖుల ప్రభువు’ ప్రకటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలాంటి విమర్శలు ప్రధానిగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే మంచిది కాదు.. ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత మంచిది అని ఆయన చెప్పుకొచ్చారు.
Raja Singh: ఓబీసీ నేత నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదే అని బీజేపీ శాసనసభ్యులు రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. బీసీ ద్రోహుల పార్టీలు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు.
ఎన్డీయే ప్రభుత్వం DNAలోనే తెలంగాణ రాష్ట్రంపై విషం నింపుకునీ ఉన్నది అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము.. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. తెలంగాణ పుట్టుకను పదే పదే ఎందుకు అవమానిస్తున్నారు?.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.