Modi Warangal Tour: తెలంగాణ ప్రజల బలమే భారతదేశ బలాన్ని పెంచుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం హిందీలో ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. అందులో రూ. 521 కోట్లు కాజీపేటలో నిర్మించనున్న వ్యాగన్ తయారీ పరిశ్రమకు రూ. 3,441 కోట్లు ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణకు రూ. 2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఇంటర్ కారిడార్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు అవుతుందని గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
Read also: Kishan Reddy: గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్
దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు. ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు తెలంగాణ ప్రజల పాత్ర చాలా పెద్దదని అన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపుతోందని తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్‌కు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నప్పుడు తెలంగాణకు అనేక అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. 21వ శతాబ్దపు ఈ మూడో దశాబ్దంలో మనకు స్వర్ణయుగం వచ్చిందని మోదీ అన్నారు. ఈ స్వర్ణయుగంలోని ప్రతి సెకనును పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేడు తెలంగాణలో రూ. 6 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామన్నారు. దేశాభివృద్ధికి శరవేగంగా కృషి చేస్తున్నామని చెప్పారు.