ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. మోడీని చంపుతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్ ను ట్రేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.
అవినీతిని నేను ఒప్పుకోను.. అవినీతి పరుల పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రియమైన సోదర సోదరీ మణులారా.. మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు.
ఏపీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు పలికారు సీఎం వైఎస్ జగన్.. అదే సమయంలో తమ ప్రభుత్వ కోరికల చిట్టాను ఆయన చేతిలో పెట్టారు..
ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లో ఎంత బిజీగా వున్నా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం ఆయన తన స్టయిల్ చూపిస్తారు. తాజాగా ఆయన చేతిలో చిడతలు, తుంబుర పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇవాళ పూణేలో పర్యటించిన మోడీ డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2 నెలల్లోనే నాలుగు సార్లు గుజరాత్‌లో పర్యటించిన మోదీ.. తాజాగా శుక్రవారం దాదాపు రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్‌సారిలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే…
వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలచిన నిఖత్ జరీన్ ఈ రోజు ప్రధాని మోదీని కలిసింది. గత నెలలో టర్కీలో జరిగిన పోటీలో ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిట్పాంగ్ జుతామస్ ను మట్టికరిపించి, బంగారు పథకం గెలిచి వరల్డ్ ఛాంపియన్ గా గెలిచిన జరీన్ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసింది. అయితే నిఖత్ జరీన్ తో పాటు మానిషా మౌన్, ప్రవీన్ హుడాలు కూడా ప్రధానిని కలిశారు. ప్రధానితో కాసేపు…
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆహ్వానం మేరకు బుద్ధ పౌర్ణిమ సందర్భంగా భారత ప్రధానమంత్రి మోదీ నేపాల్‌కు పయనమయ్యారు. మోడీ ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ గౌతమ బుద్ధుడు మోక్షం పొందాడని ప్రసిద్ధికెక్కిన మాయాదేవి ఆలయాన్ని సందర్శింస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మోడీ. ఇక్కడ ప్రార్థనలను నిర్వహించిన తర్వాత మోడీ నేపాల్ లోని గౌతమ బుద్ధుడి జన్మస్థలం లుంబినీకి వెళ్లనున్నారు. లుంబినీ డెవలప్ మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. లుంబినీలో బౌద్ధ…