PM MODI: వరంగల్‌లో ప్రధాని మోడీ సభ.. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: ప్రధాని మోడీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజిలో ప్రధాని మోడీ సభ విజయ సంకల్ప సభకి ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా సిబ్బంది వేదికని అణువణువు తనిఖీ చేస్తున్నారు. 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై పోలీసులు నిషేధం విధించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.25 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 9.30 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. 10.15 గంటలకు వరంగల్ మామునూరు విమానాశ్రయంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు. 10.15 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్ నుంచి బై రోడ్ బయలుదేరుతారు. 10.30 గంటలకు భద్రకాళి దేవాలయానికి చేరుకుంటారు. 10.30 నుంచి 10.45 గంటల వరకు అమ్మవారికి పూజలు చేస్తారు.10.50 గంటలకు భద్రకాళి ఆలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు.11.00 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లోని సభా స్థలికి చేరుకుంటారు.11.00 గంటల నుంచి 11.35 గంటల వరకు పీవోహెచ్, వ్యాగన్ తయారీ యూనిట్‌తో పాటు జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 11.45 గంటలకు బహిరంగ సభ వేదిక పైకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
12.20 నుంచి 12.30 గంటల వరకు పార్టీ నేతలను కలుసుకుంటారు. 12.30 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 12.50 గంటలకు వరంగల్ మామునూరు ఎయిర్‌స్ట్రిప్ చేరుకుంటారు. 12.55 గంటలకు మామునూరు ఎయిర్‌స్ట్రిప్ నుంచి ఎంఐ-17 హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు. 1.40 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 1.45 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ బీబీజే విమానం ద్వారా బయలుదేరుతారు. 3.35 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
Also Read
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో.. భద్రత ఏర్పాట్లపై సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. మోడీ పర్యటన సందర్భంగా తాము మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలకు అదనంగా.. ఇద్దరు ఐజీ స్థాయి, 10 మంది డీసీపీ ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 56 సీఐలు, 250 మంది ఎస్సైలు, 3500 మంది పోలీసులు.. బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నామని.. పబ్లిక్ కమిషన్ ఎగ్జామ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే.. 8 గంటల వరకే పరీక్ష కేంద్రాలకే చేరుకోవాలని సూచించారు. అదాలత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వాహనాలకు అనుమతి లేదన్నారు. మోడీ సభకు వచ్చే కార్యకర్తలు.. 9 నుంచి 9.30 లోపే గ్రౌండ్‌కు చేరుకోవాలన్నారు. ప్రధాని టూర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Heavy Rains: రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. కర్నాటకలో 8 మంది మృతి
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..