కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్దిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్దికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పాడ్డాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షలు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాష్ట్రంలో మంచినీటి సమస్యపై పోరాటం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: Bro Trailer : బ్రో ట్రైలర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.. టాలీవుడ్లో మొదటిసారిగా అలా?
అదే స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలు చేశామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్ ను 24 గంటల పాటు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని వెల్లడించారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం తెలంగాణకు నయా పైసా కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు.
Read Also: Nama Nageswara Rao: రైల్వే మంత్రితో ఎంపీ నామ భేటీ.. ఆ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కు ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చామని కేటీఆర్ తెలిపాడు. నీతి ఆయోగ్ చెప్పినా మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి తెలంగాణకు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సమక్షంలో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గర్వంగా చెబుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.
Read Also: Laya : ఆ స్టార్ హీరో సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ..?
ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ సెక్టార్ లో పురోగతితో యువత ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని మంత్రి తెలిపారు. ఐటీ ఉద్యోగులు 9 లక్షల మందికి చేరుకున్నాయి.. ఇప్పటికే ఐటీ సెక్టార్‌లో గత రెండుళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.