ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించి పలు నివేదికలతో ఆయన విజయవాడ నుంచి భువనేశ్వర్ వెళ్లగా.. శుక్రవారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు శనివారం నాడు ఢిల్లీలో ప్రధాని మోదీతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం కానున్నారు. అయితే ఏపీ గవర్నర్ హరించందన్ మర్యాదపూర్వకంగానే ప్రధాని మోదీని కలుస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితుల కారణంగా చాలాకాలంగా ఆయన ప్రధానిని…
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీతో జగన్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55,548.87 కోట్లుగా నిర్ధారించిందని.. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి…
రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరుల త్యాగాలను కించపరచారని మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలు గమనిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం వేల మంది ప్రాణాలు అర్పించారని, ఆ అమరుల త్యాగాలను మోదీ అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై విషం చిమ్మడమే మోదీ పనిగా పెట్టుకున్నారని మంత్రి హరీష్‌రావు…
ఉగాండాలో ఓ తెలుగు అమ్మాయి చిన్నతనంలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటోంది. చదివేది 9వ తరగతి అయినా ఉగాండా అధ్యక్షుడి చేత ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 14 ఏళ్ల వయసున్న తెలుగు అమ్మాయి గొల్లపల్లి ప్రజ్ఞశ్రీ ఉగాండాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో విద్యను అభ్యసిస్తోంది. అయితే ఆ అమ్మాయికి వివిధ దేశాలు తిరగాలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె ఆహార ప్రియురాలు. అటు క్రీడల్లోనూ ప్రజ్ఞశ్రీ ప్రతిభను చాటుతోంది. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ వంటి ఔట్ డోర్ గేమ్స్‌తో…
ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగిన గోదా దేవి కల్యాణంలో పాల్గొన్న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. కల్యాణ అనంతరం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 5న ప్రధాని ఆశ్రమంలో జరిగే రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. వేదికలో మూడు తలాలు ఉన్నాయి. మద్య తలంలో బంగారు విగ్రహాన్ని ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రతిష్ట చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 14న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరుపున అన్ని పనులు చేయడానికి…
ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని లేఖలో కోరారు. ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో హామీ ఇచ్చారని… ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర నష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరగడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రైతు…
★ నేటి నుంచి ఈనెల 9 వరకు తిరుపతిలోని ఇందిరా మైదానంలో జాతీయ కబడ్డీ పోటీలు★ మంగళగిరిలో నేడు రెండో రోజు పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం.. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జులతో భేటీ కానున్న చంద్రబాబు★ 750వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం… రాజధాని గ్రామాల్లో అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు.. ఆగిన అమరావతి నిర్మాణం-అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్ర పేరుతో సదస్సులు.. వెలగపూడి, తుళ్లూరు, మందడంలో ప్రజాచైతన్య సదస్సులు★ తెలంగాణ హైకోర్టులో నేటి నుంచి…
భారత ప్రధాని మోదీని భూటాన్ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ విషయాన్ని భూటాన్ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా సమయంలో తమకు అందించిన మద్దతుకు గుర్తింపుగా తమ దేశ అత్యున్నత అవార్డు ‘నగ్డగ్ పెల్ గి ఖోర్లో’ను మోదీకి బహూకరించాలని భూటాన్రాజు జిగ్మే ఖేసర్నగ్మే వాంగ్చుక్సూచించినట్లు తెలిపింది. ఈ అవార్డును 2008లో భూటాన్ ప్రవేశపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు మన ప్రధాని మోదీ మాత్రమే. Read…
✍ నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనానికి శంకుస్థాపన… హాజరుకానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా✍ కర్నూలు: నేడు డోన్ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం… వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష… హాజరుకానున్న మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం✍ నేడు తమిళనాడు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్… శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్……