Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళిని వరుసగా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. గతంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్.. వారి కుటుంబ సభ్యులపై చేసిన కామెంట్లపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. పోసానిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇప్పటికే మూడు జైళ్లు తిప్పారు.. ఆయన బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది.. ఈ సమయంలో.. పోసానిపై మరో ఫిర్యాదు అందింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి టీడీపీ గ్రీవెన్స్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు..
Read Also: CM Revanth Reddy: విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం..
పోసాని కృష్ణ మురళి.. మహేష్ అనే వ్యక్తులు తన నుంచి 9 లక్షల రూపాయాలు తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు సత్యనారాయణ అనే వ్యక్తి.. ఈ వ్యవహారంలో గతంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని.. అందుకే ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 9 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయానంటున్నర బాధితుడు.. ఇంటికి వెళ్లలేక.. గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.. మరి, పోసాని కృష్ణ మురళి కేసుల వ్యవహారంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో అందిన ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..