అన్ని కేసుల్లో బెయిల్స్ సంబంధిత న్యాయస్థానాలు పోసాని కృష్ణ మురళికి బెయిల్ అందించాయి. నిన్న నర్సారావుపేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి.
అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిపై మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఒక్కో కేసులో పీటీ వారెంట్ కోరుతూ పోలీసులు పలు స్టేషన్ లలో విచారించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు.. తర్వాత అక్కడ నుంచి నర్సరావుపేటకు, గుంటూరుకు తరలించారు. అక్కడ నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు, అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు పంపారు..
READ MORE: Javed Akhtar : ముక్కు, మొహం తెలియని హీరోలు వాళ్లు.. సౌత్ స్టార్లపై రచయిత వ్యాఖ్యలు
పోసాని 67 ఏళ్ల వయసులో హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్నాడు. వైసీపీ లీగల్‌సెల్.. హైకోర్టుకు పోసాని కృష్ణమురళి పరిస్థితిని నివేదించింది. వాదనల అనంతరం నమోదైన కేసుల్లో 35(3)నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం ఒన్‌టౌన్లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత చురుగ్గా దిగువ కోర్టుల్లో న్యాయ స్థానాలను ఆశ్రయించింది వైసీపీ లీగల్ సెల్. ఒక్కొక్కటిగా బెయిల్స్ మంజూరయ్యాయి. వైసీపీ పోసానికి పూర్తిగా అండగా నిలిచింది. అన్ని కేసుల్లో పోసాని బెయిల్ పొందారు. రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.
READ MORE: Balochistan: బలూచిస్తాన్ స్వాతంత్రం తప్పదా?.. పట్టుకోల్పోతున్న పాకిస్తాన్.. అసలేంటి ఈ వివాదం..