గత కొన్నేళ్లుగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది.
PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను…
Demands to ban PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు, మనీలాండరింగ్ కు పాల్పడుతుందని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ), ఈడీలు సంయుక్తంగా 15 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. 100కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘ ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దాడులను నిరసిస్తూ శుక్రవారం కేరళలో చేపట్టిన ధర్నా హింసాత్మకంగా మారింది. ఈ దాడులకు వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టారు.
NIA conducts raids at multiple locations in Bihar: బీహార్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ఇటీవల బీహార్ పోలీసులు పాట్నా ఉగ్ర కుట్రను ఛేదించారు. ఈ కేసుపై ఎన్ఐఏ కూడా విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఉగ్రకుట్రలో కీలకంగా ఉన్న కొంతమంది ఇళ్లపై దాడులు నిర్వహించారు. బీహార్ దర్భంగాలోని ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నూరుద్దీన్, సనావుల్లా, ముస్తకీమ్ ఇళ్లపై దాడులు చేసింది ఎన్ఐఏ. ఈ ముగ్గురు కూడా…
RJD chief's controversial comments: బీహార్ రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) చీఫ్ జగదానంద్ సింగ్ శనివారం మరో వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆర్ఎస్ఎస్, హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సైద్ధాంతిక విభాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), తీవ్రవాద గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) రెండూ కూడా ఒకటే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు గ్రూపులు కూడా వారి మతస్తులకు సేవ చేయాలని అనుకుంటున్నాయని సమర్థించాడు
ఉత్తర్ ప్రదేశ్ అల్లర్లలో యోగీ సర్కార్ పట్టుబిగిస్తోంది. అల్లర్లకు కారణం అయిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలను చేశారు. అయితే చాలా వరకు శాంతియుతంగానే నిరసనలు తెలిపినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యూపీలోని కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్, హత్రాస్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అల్లరి…