ప్రస్తుతం సినిమా ఎలా ఉంది అన్నదానికన్నా ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా చేశారు అనేదాని గురించే ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావాలంటే ముందు దానికి ప్రమోషన్స్ చేసి జనాలలో ఆ పేరును నానిస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది కాదు ప్రమోషన్స్ కి ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాం అనేది ముఖ్యం అంటున్నారు…
దక్షిణాది అగ్రహీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అమ్మడి కోసం ప్రముఖ నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. పూజ ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక పూజహేగ్డే కూడా తనకు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తోంది. రాబోయే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో చిన్న పాత్రలో కూడా కనిపించనుంది.…
ప్రస్తుతం టాలీవుడ్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోల సరసన అమ్మడు నటిస్తున్న సినిమాల లైన్ పెరిగిపోవడంతో పూజా టాలీవుడ్ లక్కీ చార్మ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన పూజా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. ఇకపోతే గత కొన్నిరోజుల నుంచి ఈ బడా…
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ తో నిరాశ చెందిన ఈ భామ ప్రస్తుతం బీస్ట్ పైనే ఆశలు పెట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ కి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం.…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బుట్టబొమ్మ పూజా హెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు. పూజా మన కాజా అంటూనే అడుగు పెడితే హిట్టే అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేనా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇవ్వమని కూడా అడిగేశారు. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఇలా పొయెటిక్ గా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అయితే అసలు ఆయన పూజాపై ఈ పొగడ్తల వర్షం ఎప్పుడు ? ఎక్కడ…
ఓ టాప్ హీరో సినిమా అంటే చాలు… ట్రైలర్ లో కావలసినంత కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు, పొడుచుకోవడం, చంపుకోవడం, రక్తసిక్తం- ఇలాంటి అంశాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. తమిళ టాప్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ట్రైలర్ కూడా ఇలాగే రూపొందింది. కొత్తదనమేమీ కనిపించదు. మూడు రోజుల క్రితం తమిళంలో సందడి చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులోనూ అనువాదపు పలుకులతో అలరించే ప్రయత్నం చేస్తోంది. విజయ్ హీరోగా…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ తో ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఒక గూఢచారి అయిన హీరో షాపింగ్ మాల్ ని హైజాక్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్దే జంటగా నటించిన చిత్రం బీస్ట్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. మరి ముఖ్యంగా అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రిటీ చూసిన ఇదే సాంగ్ ని రీక్రియేట్ చేసి ఇంకా…
ఇలయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13న వ్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విజయ్ కి తెలుగులో మార్కెట్ అంతంత మాత్రమే. తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్, సూర్య, కార్తీ, విశాల్ తెలుగునాట కూడా తమకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగినా విజయ్ మాత్రం ఈ వైపు దృష్టి పెట్టలేదు. ఇటీవల కాలంలో విజయ్ సినిమాలు…