పూజా హెగ్డే గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇక పాన్ ఇండియా మూవీ అంటే మాత్రం పూజాహెగ్డే వైపే చూస్తున్నారు అగ్ర దర్శకనిర్మాతలు, హీరోలంతా! స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ అందరికీ లక్కీ ఛార్మ్‌గా మారిన ఈ బ్యూటీ మరోమారు ఐటెం సాంగ్ లో మెరవబోతోంది. సాధారణంగా నటీమణులు టాప్ పొజిషన్‌లో ఉంటే ఐటెం సాంగ్స్ చేయరు. అయితే పూజా అలాంటి రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఐటెం నంబర్స్ కూడా చేయడానికి సై అంటోంది. ఇప్పటికే రంగస్థలంలో “జిగేలు రాణి”గా ఉర్రూతలూగించిన బుట్టబొమ్మ, ఇప్పుడు ఈ హాట్ సమ్మర్ లో “ఎఫ్ 3” తెరపై తన ఐటెం సాంగ్ తో మంట పెట్టడానికి రెడీ అవుతోంది.
Read Also : Selfish Movie Launch : ధనుష్ అతిథిగా సినిమా ప్రారంభోత్సవం
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను చక్కిలిగింతలు పెట్టడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ తో అలరించడానికి టీం సిద్ధమైంది. ఇందులో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేస్తుండగా, కేవలం ఒక్క పాటకే ఆమెకు కోటి రెమ్యూనరేషన్ అందుతున్నట్టు తెలుస్తోంది. అది దాదాపు ఒక సినిమాకి వచ్చే రెమ్యునరేషన్. మరి పూజకు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా నిర్మాతలు సైతం ఈ బ్యూటీ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.