తలపతి విజయ్ నటించిన “బీస్ట్” ఏప్రిల్ 13న వెండితెరపైకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. “బీస్ట్” వర్సెస్ “కేజీఎఫ్-2” అన్నట్టుగా ఒకే ఒక్క రోజు గ్యాప్ తో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ‘కేజీఎఫ్-2’ చిత్రానికి అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఆ ఎఫెక్ట్ “బీస్ట్”పై గట్టిగానే పడింది. మిగతా భాషల సంగతి ఎలా ఉన్నా, తమిళనాడులో విజయ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో తమిళంలో మాత్రం బాగానే రాణిస్తోంది “బీస్ట్”.
Read also : Tiger Nageswara Rao : 5 ఎకరాల్లో భారీ సెట్… కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
ఇక ఈ సినిమా ఓటిటిలో విడుదల కానున్న తేదీ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. “బీస్ట్” ఓటిటి రిలీజ్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తరువాత మూవీని ఓటిటిలో విడుదల చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఈ చిత్రం మే 11న నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టిలో ప్రీమియర్ అవుతుంది.