అభిమానం.. ఎవరు ఆపినా ఆగనిది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పోస్టర్లు, ఫ్లెక్సీలు.. పూలదండలు.. పేపర్లు ఎగరేయడాలు.. అబ్బో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే వారికి పండగే అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభిమానం హద్దుమీరుతుంది. తమ హీరో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుందని ప్రాణాలను కూడా తీసుకున్న అభిమానులను చూసాం.. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానుల అభిమానం మాత్రం అంతకుమించి ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సినిమా నచ్చలేదని స్క్రీన్ ను తగలబెట్టిన ఘటన తమిళనాడులోని ఒక థియేటర్లలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వెళ్లిన అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ అభిమానాలు ఆగ్రహంతో ఊగిపోయారు. సినిమా మధ్యలోనే స్క్రీన్ కు నిప్పంటించారు. దీంతో థియేటర్లో గందరగోళం నెలకొంది. స్క్రీన్ ని తగలబడడం చూసిన యాజమాన్యం వెంటనే సినిమాను ఆపి మంటలను వ్యాప్తి కాకుండా అదుపుచేశారు. ఇక ఈ ఘటనకు సంబధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా నచ్చకపోతే స్క్రీన్ తగలబెడతారా..? అని కొందరు.. అభిమానం హద్దు మీరడమంటే ఇదే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster
— 🔥 Ajith Kumar🔥Fan (@thala_speaks) April 13, 2022